కొవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలంటూ సాధన దీక్ష పేరుతో టీడీపీ రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమం చేప్టటింది. వాస్తవానికి వారం రోజులపాటు నిరసన వారం పేరుతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి చివరిరోజున నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షలు చేపట్టాలనేది టీడీపీ ఆలోచన. అయితే నిరసనవారం కాస్తా నీరసంగా సాగింది. అనుకూల మీడియాతో ఎంత హైప్ ఇవ్వాలనుకున్నా కూడా టీడీపీ నిరసన దీక్షలు హైలెట్ కాలేదు. ఇక చివరిరోజు ఏర్పాటు చేసిన సాధన దీక్షకు స్వయంగా చంద్రబాబు హాజరైనా కూడా పసలేదని అంటున్నాయి రాజకీయ వర్గాలు.