ప్రధాని నరేంద్రమోదీ ఆజన్మ బ్రహ్మచారి, ఆయనకు వారసులు లేరు, వారసులున్నవారే ముందు తరాలకోసం అవినీతికి పాల్పడతారు, వారసులు లేరు కాబట్టి మోదీకి అవినీతి మకిలి అంటలేదు.. అంటూ మోదీ భక్తబృందం చెప్పే మాటలకు అంతూ పొంతూ ఉండదు. అయితే ఆయనకిప్పుడు కొత్తగా ఇద్దరు రాజకీయ వారసులు పుట్టుకొచ్చారు. ఈ వారసుల్ని కూడా ఎవరో గిట్టనివారు తెరపైకి తేలేదు. స్వయానా బీజేపీ అభిమాన బృందమే, ఆనందంగా ఆయా ఫొటోలను రెడీ చేయించి మురిసిపోతోంది. మోదీ రాజకీయ వారసులుగా అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ ని భావి ప్రధానులుగా కీర్తిస్తోంది.