పైకి అది రాయలసీమ ఎత్తిపోతల పథకం కోసం జరుగుతున్న పోరాటం. కానీ లోపల బీజేపీని రెండు తెలుగు రాష్ట్రాల్లో బలహీన పరిచే వ్యూహం. ముఖ్యంగా హుజూరాబాద్ ఎన్నికల వేళ, బీజేపీని దారుణంగా దెబ్బతీసేందుకు కేసీఆర్ అమలు పరచిన పక్కా స్కెచ్ అది. తాజాగా నీటి వాటాలపై కామెంట్ చేసిన కేసీఆర్ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటూ కొత్త మెలిక పెట్టారు. గతంలో కృష్ణా నది నీటిని 66శాతం ఏపీ, 34శాతం తెలంగాణ వాడుకోవాలనే ఒప్పందం ఉంది. అయితే దాన్ని వద్దని, ఇరు రాష్ట్రాలకు కృష్ణా జలాల్లో యాభైశాతం వాటా ఉంటుందని షాకిచ్చారు కేసీఆర్.