రాయలసీమ ఎత్తిపోతల వంటి పథకాలను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మరోవైపు జలవిద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ నీటిని వృథాగా సముద్రంపాలు చేస్తోందని ఏపీ మండిపడుతోంది. కృష్ణారివర్ మేనేజ్ మెంట్ బోర్డు దీనిపై చర్యలు తీసుకోవాల్సి ఉన్నా ప్రభుత్వాలు ససేమిరా అంటున్నాయి. ఈ క్రమంలో నీటి పంచాయతీ కేంద్రానికి చేరినట్టే. చర్చలద్వారా సమస్య సానుకూలంగా పరిష్కారం కావాల్సిందే కానీ, కోర్టు కేసులతో ఎవరికీ ఉపయోగం ఉండదనేది మాత్రం వాస్తవం.