ఇప్పటివరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలోని ఒక కోణాన్నే అందరూ చూశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ.. నగదు బదిలీతో కరోనా కష్టకాలంలో కూడా పేదలకు ఆర్థిక భరోసా ఇస్తూ, రాష్ట్రం అప్పులపాలవుతోందన్న ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కొంటూ రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు జగన్. ఇప్పుడిక తన పాలనలో కొత్త మార్కు చూపించాలనుకుంటున్నారు. మూడేళ్లలో పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్లేందుకు జగన్ సిద్ధమయ్యారు.