తెలుగు అకాడమీని.. తెలుగు-సంస్కృత అకాడమీగా పేరు మారుస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా ఎందుకు చేశారో.. దీనివల్ల ఒనగూరేదేమిటో ఒక పట్టాన అంతుపట్టదు. ఇప్పటికిప్పుడు సంస్కృతాన్ని ఉద్ధరించాలన్న డిమాండ్ ఏమీ లేదు.