తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న జలవివాదంలో ఇప్పటి వరకూ టీడీపీ నోరు మెదపలేదు. ఇన్నాళ్లూ చంద్రబాబు సహా టీడీపీ నేతలకు జగన్ ని టార్గెట్ చేసే పాయింట్ దొరకలేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి మద్దతుగా మాట్లాడాలంటే అది జగన్ ని పొగిడినట్టే అవుతుంది. జగన్ ఆలోచనను మెచ్చుకున్నట్టవుతుంది. అందుకే చంద్రబాబు సైలెంట్ గా ఉన్నారు. కానీ ఇప్పుడు గొడవ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి క్రమంగా జల విద్యుత్ ఉత్పత్తివైపు మలుపు తిరిగింది. అక్కడినుంచి కృష్ణా జలాల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ వాటా వైపు టర్న్ తీసుకుంది. దీంతో చంద్రబాబు రంగంలోకి దిగారు. టీడీపీ నేతలు జల వివాదంలో జగన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.