తెలంగాణ ఉద్యమాన్ని పరుగులు పెట్టించి రాష్ట్రాన్ని సాధించిన తర్వాత కేసీఆర్ సీఎం అయ్యారు. ఇప్పుడు ఆయన్ను ఎదుర్కొనేందుకు ప్రత్యర్థులు కూడా కేసీఆర్ మంత్రాన్నే జపిస్తున్నారు. కేసీఆర్ తరహాలోనే మాటలతో మంటలు పుట్టిస్తున్నారు. ప్రత్యేకించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ నుంచి ఈ లక్షణాన్ని అందిపుచ్చుకున్నారు.