తెలంగాణ సర్కారు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంపై దృష్టి సారించింది. తాజాగా తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీకి తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పాలసీ వివరాలు ఏంటంటే.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెద్దఎత్తున ప్రోత్సహించాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిదశలో కనీసం 10 ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.