ప్రతిపక్షనేతగా పాదయాత్ర చేపట్టిన జగన్, ఆనాడు ఇచ్చిన అన్ని వాగ్దానాలను దాదాపుగా నెరవేర్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఇచ్చిన హామీలను కూడా అమలులోకి తెచ్చారు. అయితే ఒక్క విషయంలో మాత్రం జగన్ ఆలోచనకు, ఆచరణకు ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. మూడు రాజధానుల విషయంలో జగన్ అనుకున్నది జరగడంలేదు, అదే సమయంలో అది ఆచరణ సాధ్యమా..! అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.