తెలంగాణలో ప్రెస్ అకాడమీ కొంత వరకూ జర్నలిస్టులను ఆదుకుంటోంది. కరోనాతో మరణించిన జర్నలిస్టులకు సంబంధించిన కుటుంబాల వారికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు తాజాగా తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రకటించారు.