సుప్రీంకోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ సర్కారును ఉద్దేశించి చేసినవా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకించి కొందరు ఫ్యాక్షనిస్టులు అధికారదాహంతో బెదిరింపులకు పాల్పడుతూ కొందరికి బెయిల్ రాకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చేసిన వ్యాఖ్యలు ఇటీవలి రఘురామ కృష్ణంరాజు ఎపిసోడ్‌ను తలపించాయి.