వైఎస్సార్టీపీ పేరుతో తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల పూర్తిగా తెలంగాణ స్టాండ్ తీసుకున్నారు, తీసుకోవాలి కూడా. ఇప్పటి వరకూ తెలంగాణ ప్రాంతానికి వైఎస్ఆర్ వ్యతిరేకం అనే అభిప్రాయం ఉంది. ఆమె దాన్ని పూర్తిగా తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్మడి ఏపీలో ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా నాటి సీఎం వైఎస్ఆర్ తీర్మానం చేయించిన విషయాన్ని గుర్తు చేస్తూ, తెలంగాణకు ఆయన అనుకూలం అనే మెసేజ్ వెళ్లేలా చేస్తున్నారు షర్మిల. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదం కూడా షర్మిలకు ఇబ్బందికరంగా మారుతోంది.