కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్ లోకి ఆహ్వానించే వేళ, కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాస్త కలకలం రేపాయి. గతంలో తనకు ఎన్టీఆర్ అవకాశం ఇవ్వడం వల్లే ఎమ్మెల్యే కాగలిగానంటూ గుర్తు చేసుకున్నారు కేసీఆర్. అయితే హఠాత్తుగా సారు ఎన్టీఆర్ జపం చేయడం ఏంటా అని డైలమాలో పడ్డాయి టీఆర్ఎస్ శ్రేణులు. అయితే ఇది ఆయనకు బాగా అలవాటైన పనే. ఎన్నికలంటే చాలు కేసీఆర్ కి గత స్మృతులు మస్త్ గ గుర్తొస్తాయి. అలా ఇప్పుడు మరో ఆణిముత్యం ఆయన నోటినుంచి జాలువారిందంతే.