దక్షిణాదిన బలపడాలనుకుంటున్న బీజేపీ.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకుని రాజకీయాలు చేస్తోంది. తమిళనాట బీజేపీ అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని సార్వత్రిక ఎన్నికల బరిలో దిగింది. అయితే అధికార అన్నా డీఎంకే చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఇటు బీజేపీకి కూడా అనుకున్న స్థాయిలో ఓట్లు రాలేదు. దీంతో కూటమి మూణ్ణాళ్ల ముచ్చటేనని అందరూ భావించారు. ఆ అంచనాలను నిజం చేస్తూ బీజేపీ ఇప్పుడు అన్నాడీఎంకేకి షాకిచ్చింది.