మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా వైఎస్ షర్మిల వేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది. ట్రోలింగ్ మొదలైన తర్వాత ఆమె ఆ ట్వీట్ ని డిలీట్ చేశారు. అయితే ఆ తర్వాత పాత ట్వీట్ ని రీపోస్ట్ చేశారు. కేసీఆర్ కొడుకు కేటీఆర్ అంటూ షర్మిల చేసిన ట్వీట్ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ట్వీట్ వేయడం, తీయడం, మళ్లీ రీపోస్ట్ చేయడంతో.. షర్మిల ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. అయితే షర్మిల అభిమానులు, వైఎస్సార్టీపీ నేతలు ఆమెకు మద్దతుగా ట్వీట్లు వేస్తున్నారు. కేటీఆర్ అభిమానులకు కౌంటర్ ఇస్తున్నారు.