రాజద్రోహం కేసుపై సుప్రీంకోర్టును ఆశ్రయించామని.. తమ పిటిషన్‌కు కౌంటర్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం... తమపై నమోదు చేసిన కేసుకు బలం చేకూర్చే ఒక్క ఆధారం కూడా చూపలేదని ఆర్కే అన్నారు. అయితే.. రఘురాజు నాకు ఏదో మెసేజ్ పంపారని ఆ కౌంటర్లో పేర్కొన్నారని... ఈ మెసేజ్ తనకు అందిన మాట వాస్తవమేనని..కానీ దానికి తాను జవాబు ఇవ్వలేదుగా అని సమర్థించుకున్నారు. అంతే కాదు.. ఏబీఎన్ ప్రతినిధి వెంకటకృష్ణకు, రఘురాజుకు మధ్య మెసేజ్‌లు పంపుకోవడం జరిగిందని.. అందులో వింతేముందని వాదించారు.