తెలుగు రాష్ట్రాల్లోనూ పలువురు ప్రముఖుల ఫోన్లు హ్యాక్ అయ్యాయట. అయితే ఎవరి ఫోన్లు హ్యాక్ అయ్యాయన్న విషయాలు వెలుగులోకి రాలేదు కానీ.. హ్యాక్ అయ్యింది మాత్రం వాస్తవం అని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అంటున్నారు. ఆయన తన సంపాదకీయంలో ఈ విషయం ప్రస్తావించారు. అంతే కాదు.. ఈ ఫోన్ హ్యాకింగ్ విషయాన్ని ఏకంగా ఓ ముఖ్యమంత్రి తన సన్నిహితుల వద్ద అన్నట్టు ఆంధ్రజ్యోతి పత్రికాధిపతి రాధాకృష్ణ రాసుకొచ్చారు.