ఓ ఎంపీకి ఓ సీఎంను తిట్టేందుకు ఏకంగా రూ. 8 కోట్ల రూపాయల లంచం ఇచ్చారంటే నమ్మశక్యంగా ఉంటుందా.. మరి ఇది నిజమో కాదో కానీ.. ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిళ్లో ఈ ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ను రోజూ ప్రెస్ మీట్లు పెట్టి తిట్టేందుకు ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ఓ ఛానల్ 8 కోట్ల రూపాయలు ఆఫర్ చేసిందట. ఆ డీల్ ప్రకారమే సదరు ఎంపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు రోజూ జగన్ను తిడుతూ ప్రెస్ మీట్లు పెడుతున్నాడట.