అంతర్జాతీయ సరిహద్దులకంటే అత్యంత సున్నితంగా తయారైంది అసోం-మిజోరం సరిహద్దు. రెండు రాష్ట్రాల మధ్య ఇలాంటి వాతావరణం ఉంటుందని ఎవరూ అనుకోరు. కానీ 1972లో అసోం నుంచి మిజోరం వేరుపడినప్పటినుంచి ఆ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు సమస్యలు ఉంటున్నాయి. 165కిలోమీటర్ల మేర ఉన్న సరిహద్దులో ఎప్పుడూ గొడవలే. అయితే కేంద్ర ప్రభుత్వం అప్పట్లోనే దీన్ని నిర్లక్ష్యం చేసింది. దీంతో ఇప్పటి వరకు సరిహద్దు గొడవలు తగ్గలేదు. తాజాగా ఆరుగురు అసోం పోలీసులు చనిపోవడం అత్యంత బాధాకరం. ఈ దాడిలో 60మందికి పైగా గాయాలయ్యాయి.