కేసీఆర్ కు ఇప్పుడు దళితులపై అంతులేని ప్రేమ పుట్టుకొచ్చింది. ఎంత ప్రేమ అంటే.. ఎన్నిలక్షల కోట్లు ఖర్చు చేసైనా సరే.. సమాజంలో అట్టడుగున ఉన్న దళితులను ఆదుకోవాలన్నంత.. వాళ్ల జీవితాలను అమాంతం మార్చేయాలన్నంత.. ఉన్నపళంగా దళితులను లక్షాధికారులను చేయాలన్నంత.. మరి ఇంత ప్రేమ ఒక్కసారిగా ఒకరిపై మరొకరికి కలిగితే.. కాస్త అనుమానించాల్సిందే.. ఆలోచించాల్సిందే.. కాస్త ముందూ వెనుకా చూడాల్సిందే.