ప్రజా సమస్యలపై నాయకుడు ముందుండి పోరాడాలన్న విషయాన్ని మాత్రం ఎందుకో లోకేష్ మరచిపోతున్నారు. జాబ్ క్యాలెండర్ వ్యవహారాన్ని కేవలం టీఎన్ఎస్ఎఫ్ నాయకులకు వదిలేశారు. ఆమధ్య నిరసన వారం పేరుతో వారం రోజులపాటు ఆందోళన కార్యక్రమాలు చేపట్టి.. చివరి రోజు జూమ్ లో మీటింగ్ పెట్టి నిరాశపరిచారు టీడీపీ నేతలు. ప్రజా క్షేత్రంలో దూకేందుకు, ప్రజల తరపున ప్రజల్లో ఉండి పోరాడేందుకు మాత్రం లోకేష్ ఎందుకో వెనకాడుతున్నారు.