అసలు గత పదేళ్లలో భారత్ నుంచి స్విస్ బ్యాంకుల్లో జమచేసిన బ్లాక్‌మనీకి సంబంధించి అధికారికంగా అంచనాలేమీ లేవట. దీనికి సంబంధించి లెక్కలు లేవట. పదేళ్ల నుంచి లేవంటే.. పదేళ్ల కిందట కాంగ్రెస్ అధికారంలో ఉంది. మరి మోడీ పగ్గాలు చేపట్టాక ఏం చేసినట్టు.. ఏడేళ్ల నుంచి కనీసం లెక్కలు కూడా తెప్పించకుండా ఏంచేస్తున్నట్టు.. ఏడేళ్ల నుంచి నల్లధనంపై ఏమీ చేయని మోడీ సర్కారు ఇక ముందైనా ఏమైనా చేస్తుందా..?