మరి నోటిఫికేషన్ కూడా రాకముందే.. అప్పుడే విపరీతమైన ఖర్చు ప్రారంభమైతే.. ఈ హుజూరాబాద్ ఉపఎన్నిక ఖర్చయ్యే సరికి పార్టీలు ఎంత ఖర్చు చేస్తాయి అంటే ఊహించడం కూడా కష్టమే. ఒక విధంగా ఈ హుజూరాబాద్ ఎన్నికల వాస్తవ ఖర్చు ప్రకారం చూస్తే.. ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన ఉప ఎన్నిక అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.