పెట్రోలియం ఉత్పత్తుల రేట్లు భారీగా పెరిగిపోతున్నాయి, వ్యాక్సిన్ల కొరత భారత్ ను ఇంకా వేధిస్తోంది, కరోనా మూడో వేవ్ విజృంభిస్తే.. కేంద్రం సన్నద్ధత ఎంత అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. ఇన్ని సమస్యలున్నా.. పార్లమెంట్ లో ఏదీ ప్రస్తావనకు రావడంలేదు. పెగాసస్ పేరుతో జరుగుతున్న రాద్ధాంతమే హైలెట్ అవుతోంది. చివరకు తప్పంతా ప్రతిపక్షాలపై నెట్టేసి, పార్లమెంట్ లో చర్చ జరగనీయకుండా చేస్తున్నారంటూ ప్రభుత్వం విజయవంతంగా తప్పించుకు తిరుగుతోంది.