కేంద్రంలో మూడో కూటమికి ప్రయత్నాలు జరుగుతుండగా, మరోవైపు బీజేపీలో గుబులు మొదలైంది. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పట్టు నిలుపుకోవడంతోపాటు, కొత్త రాష్ట్రాల్లో కూడా కాషాయ జెండా రెపరెపలాడించాల్సిన అవసరం ఉంది. ఇటీవల పలు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన ఫలితాలు లభించలేదు. వచ్చ ఏడాది జరగాల్సిన ఎన్నికల్లో కూడా బీజేపీకి ఘన విజయాలు స్వాగతం పలుకుతాయనే అంచనాలు లేవు. దీంతో ప్రాంతీయ పార్టీలపై బీజేపీ పూర్తి స్థాయిలో దృష్టిపెట్టింది. దక్షిణాదిన బలంగా ఉన్న పార్టీలను కలుపుకొని పోవాలని ఆలోచిస్తోంది. ముఖ్యంగా ఏపీలో వైసీపీపై వారి దృష్టి పడింది.