తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపో మాపో మహూర్తం ఖరారవుతుందని అందరూ ఆశపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికలకు సుముఖంగా ఉందని, అందుకే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అడిగిందని చెబుతున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఆశావహులకు షాకిస్తూ ఎమ్మెల్సీ ఎన్నికలకు నో చెప్పారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులింకా చక్కబడలేదు, ఈ దశలో ఎన్నికలంటే కష్టం అంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి బదులిచ్చారు