ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేని వాళ్లకు.. గతంలో హామీ ఇచ్చిన వాళ్లకు పార్టీల అధినేతలు ఇలా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ సీటు ఇచ్చి సంతృప్తి పరుస్తున్నారు. తాజాగా జరిగింది అదే.. హుజూర్నగర్ ఉప ఎన్నిక రీత్యా కీలకమైన కౌశిక్ రెడ్డిని కాంగ్రెస్ నుంచి పార్టీలో చేర్చుకున్న కేసీఆర్.. ఆయనకు ఏదో ఒక అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు. వెంటనే.. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.