ఇప్పుడు కేసీఆర్ శత్రువుల జాబితా తీస్తే అది చాలా పొడగవుతుంది. అయితే విచిత్రం ఏంటంటే.. ఇంత మంది శత్రువులను తయారు చేసుకోవడం ద్వారా కేసీఆర్ లాభపడుతున్నారు. వీరంతా ఏకతాటిపైకి వచ్చే అవకాశం లేకపోవడంతో.. వచ్చే ఎన్నికల్లో ఓట్లు గణనీయంగా చీలే అవకాశం ఉంది.