కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్‌లోనే పుట్టిందనే వాదనలకు ఈ అమెరికా నివేదక బలం చేకూరుస్తోంది. చైనా పరిశోధన కేంద్రం నుంచే మహమ్మారి పుట్టినట్లు అమెరికాలోని రిపబ్లికన్ ప్రతినిధి మైక్ మెక్కాల్ అంటున్నారు. వుహాన్ ల్యాబ్‌లో కరోనా వైరస్ మానవులకు సోకేలా జన్యుపరమైన మార్పులు చేశారని రిపబ్లికన్లు చెబుతున్నారు. చైనా ఆ సంగతి దాచి పెట్టిందని చెబుతున్నారు.