ఏపీని అప్పుల్లో ముంచేశారంటూ ఇప్పటి వరకు టీడీపీ నేతలు విమర్శలు సంధించారు. తాజాగా బీజేపీ ఆ అంశాన్ని హైలెట్ చేస్తోంది. ఏకంగా జాతీయ స్థాయిలో ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీ అప్పులపై కేంద్ర మంత్రుల్ని కలసి వీర్రాజు బృందం వినతిపత్రాలిస్తోంది. ఏపీ పరిమితికి మించి అప్పులు చేస్తోందని ఫిర్యాదు చేశారు నేతలు. ఏపీ ప్రభుత్వం జీతాలివ్వలేకపోతోందని విమర్శించారు. కేంద్రం చేస్తున్న అప్పుల్ని సాకుగా చూపడం సరికాదన్నారు. ఈ దశలో వైసీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఏపీ అప్పుల పేరుతో ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.