నిజమైన నాయకుడికి గెలుపోటములు కేవలం సంఘటనలు మాత్రమే. ఆ నాయకుడు ఎప్పుడూ జనం మధ్యనే ఉంటాడు. కానీ.. పవన్ మాత్రం ఇంకా ఫుల్ టైమ్ రాజకీయ నాయకుడు కాలేకపోతున్నారు. తెలంగాణలో ఇటీవల షర్మిల కొత్తగా పార్టీ పెట్టారు. తరచూ జనంలోకి వెళ్తున్నారు. ఆమె విజయం సాధిస్తుందా లేదా అన్నది తర్వాత కానీ.. అలాంటి ప్రయత్నం పవన్ నుంచి మాత్రం కనిపించడం లేదు.