టీడీపీనుంచి చాలామంది వైసీపీలోకి వెళ్దామనుకుంటున్నా.. పార్టీకి, పదవికి రాజీనామా చేస్తేనే తమ పార్టీలోకి తీసుకుంటామనే జగన్ నిబంధన వారికి అడ్డుగా నిలుస్తోంది. అయినా కూడా కొంతమంది ధైర్యం చేసి జగన్ కి జై కొట్టారు. టీడీపీనుంచి గెలిచిన ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్.. వైసీపీ కోటరీలో చేరారు. కండువాలు కప్పుకోలేదు కానీ, తమవారిని, తమ వర్గాన్ని వైసీపీలో చేర్పించి ఆ లాంఛనం పూర్తి చేశారు. వీరితోపాటు జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా వైసీపీతోనే ఉన్నారు. వీరంతా నియోజకవర్గాల్లో ఇమడలేకపోతున్నారనేది మాత్రం వాస్తవం.