కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మధ్య ప్రస్తుతానికి మాట పట్టింపులు లేవు, ఆధిపత్య పోరు లేదు. కానీ తెలంగాణలో ఇద్దరూ పార్టీపై పెత్తనం కోసం పరోక్షంగా ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. ఒకరు పార్టీ మాజీ అధ్యక్షులు, ఒకరు తాజా అధ్యక్షులు. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారం చేపట్టే రోజు వస్తే అప్పటికి ఎవరి హవా ఉంటుందో తేలాల్సి ఉంది.