నారా లోకేశ్ కూడా ఈ మధ్య దూకుడు పెంచారు. అనేక అంశాలపై ఆందోళనకు దిగుతున్నారు. జనంలోకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పై కూడా ఏదైనా కేసు పెట్టి జైలుకు పంపుతారేమో అన్న ఆందోళన టీడీపీ నాయకుల్లో కనిపిస్తోంది. దేవినేని ఉమ మాటలు అందుకు మరింత బలాన్నిస్తున్నాయి. మరి జగన్ సర్కారు అంత పని చేస్తుందా.. లేదా.. అన్నది ఓ నెల రోజుల్లో తేలిపోతుంది.