గత ఎమ్మెల్సీ ఎన్నికల ముందు 50 వేల ఉద్యోగాలు అర్జంటుగా పూర్తి చేయండి అంటూ అధికారులకు ఆదేశాలిచ్చాం.. అంటూ హడావిడి చేశారు. కానీ.. ఇప్పటి వరకూ ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. కొత్త జోన్ల ప్రకారం ఉద్యోగాల వర్గీకరణ ఇప్పుడు పూర్తయింది. మరి ఇప్పుడైనా నోటిఫికేషన్లు వస్తాయా.. లేక మరింక సాగదీస్తారా అన్నది తేలాలి. తెలంగాణలో ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉంది కాబట్టి.. తీరిగ్గా నోటిఫికేషన్లు ఇచ్చి.. సరిగ్గా ఎన్నికల ముందు ప్రక్రియ పూర్తి చేస్తారేమో అన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా చివరకు నిరుద్యోగులు ఎన్నికల సరుకుగా మారిపోయారేమో అన్న అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది.