నిన్న మొన్నటి వరకు హుజూరాబాద్ లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగానే పోటీ ఉంది. రేవంత్ రెడ్డి సీన్ లోకి ఎంటరయ్యాక పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. కాంగ్రెస్ కి కూడా అక్కడ అవకాశాలు మెరుగుపడతాయని అంచనా వేస్తున్నారు. వాస్తవానికి హుజూరాబాద్ లో రెండోస్థానం కాంగ్రెస్ దే. అయితే అక్కడ ఈటలను ఢీకొట్టిన పాడి కౌశిక్ రెడ్డి ఇప్పుడు టీఆర్ఎస్ లో చేరారు. సో.. ఆయన వర్గం అటు వెళ్లే అవకాశాలున్నాయి. ఇటు ఈటల వర్గం బీజేపీలోకి వచ్చేసింది కాబట్టి, ఆ పార్టీ బలం కూడా పెరిగింది. రాగా పోగా.. కాంగ్రెస్ అక్కడ బలహీనపడే అవకాశముంది. కానీ రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. ఈ దశలో షర్మిల ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది. నాటి వైఎస్ఆర్ అభిమానులు, నేటి షర్మిల అభిమానులు వైఎస్సార్టీపీని బలపరిస్తే ఎలా ఉంటుంది అనేది తేలాల్సి ఉంది.