దళితబంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్ట్ గా అమలు చేయడానికి హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్న కేసీఆర్, ఆ తర్వాత తన దత్తత గ్రామం వాసాలమర్రిలో దీన్ని ప్రారంభించారు. దళిత వర్గాల్లో ఆయన పరపతి పెరిగిపోయిందని, వారంతా ఆయన్ను దేవుడంటూ ఆకాశానికెత్తేస్తున్నారంటూ కేసీఆర్ అనుకూల మీడియా బాగానే ప్రచారం చేసుకుంది. కేసీఆర్ ఫొటోలు, ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు.. ఇంకా చాలా చాలానే జరిగాయి. కట్ చేస్తే దళితులంతా కేసీఆర్ వైపు ఉంటే, మరి మిగతావారి పరిస్థితి ఏంటనేది తెరపైకి వచ్చింది. బీసీ బంధుకోసం బీసీలు డిమాండ్ చేస్తున్నారు.