ఇటీవల జరిగిన ఓ ఆన్ లైన్ సర్వేలో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల్ని స్కూళ్లకు పంపించేందుకు సుముఖంగా లేరని తేలింది. థర్డ్ వేవ్ త్వరలో మొదలు కాబోతోందని అంటున్నారు, అందులోనూ దాని ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. దీంతో పిల్లలను స్కూల్స్ కి పంపే విషయంలో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కరోనా భయాల మధ్య పిల్లల్ని బయటకు పంపించడం ఎలా అని ఆలోచిస్తున్నారు.