ఈ మాటలు నిజమేనా.. వ్యవసాయం తెలంగాణ దిశ మారుస్తుందా.. వ్యవసాయంలో పుంజుకున్నాం సరే.. వ్యవసాయ దిగుబడులు పెరిగాయి సరే.. కానీ అంతటితో రైతు అభివృద్ధి జరుగుతుందా.. పండిన పంటకు గిట్టుబాటు ధర లభించొద్దా.. రైతుకు మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపడవద్దా.. మా పంట కొనండి మహాప్రభో అని రైతులు ఈ ఏడాది మొరపెట్టుకోలేదా.. పండిన పంటను సకాలంలో కొనక రైతులు తమ పంట కాపాడుకోలేక.. ఆరుగాలం పండించిన పంట వర్షార్పణం కాలేదా..?