రాష్ట్రాలు రాజకీయ అవసరాల కోసం ఉన్నత కులాలను బిసిలలో చేర్చే ప్రమాదం ఉంది. ఆ విధంగా పార్లమెంట్ ఆమోదించిన ఓబీసీ బిల్లు వల్ల బిసిలకు నష్టం జరిగే ఛాన్స్ ఉంది. అంతే కాదు. బిసిల కోటా పెంచుకుండా.. వారి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వకుండా.. ఇతర కులాలను బీసీల్లో చేర్చడం వల్ల ఇప్పటికే ఉన్న కులాలకు నష్టమే తప్ప లాభం ఉండదు.