పేద ప్రజల కోసం ప్రవేశ పెట్టే సంక్షేమ పథకాలన్నీ అధికార పక్షానికి ఓట్ల రూపంలో ప్రతిఫలాలను ఇస్తుంటాయి. ప్రభుత్వ ఖజానా నుంచి సంక్షేమ పథకాలకోసం ఖర్చు చేసినా.. ఓట్లు మాత్రం అధికార పార్టీకి అందుతుంటాయి. అయితే అన్ని కార్యక్రమాలను ఒకే గాటన కట్టేయలేం. కొన్ని పథకాలు ప్రభుత్వ ప్రతిష్టను పెంచితే, మరికొన్ని ప్రభుత్వ ఇమేజ్ ని డ్యామేజీ చేస్తాయి. ప్రస్తుతం తెలంగాణలో అదే జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రతిష్టాత్మకంగా సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు పథకం తీవ్ర విమర్శలపాలవుతోంది.