ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ తన హామీలన్నిటినీ ఒక్కొక్కటే అమలులోకి తెస్తున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలతోపాటు, ఇవ్వని వాటిని కూడా అమలు చేస్తున్నారు. అయితే ఆయనకు ఓ కోరిక మాత్రం ఇంకా కలలాగే ఉంది. తండ్రి వైఎస్ఆర్ తో ఆగిపోయిన రచ్చబండ కార్యక్రమాన్ని తిరిగి తాను తెరపైకి తేవాలనుకుంటున్నారు. ఏడాదిగా ఆ ప్రయత్నం చేస్తున్నా కరోనా కష్టకాలంలో అది కుదరడంలేదు.