హుజూరాబాద్ రాజకీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. ఓవైపు ఈటల రాజేందర్ తన పొలిటికల్ సెకండ్ ఇన్నింగ్స్ కి హుజూరాబాద్ గెలుపుని మలుపుగా చేసుకోవాలనుకుంటున్నారు. మరోవైపు కేసీఆర్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. స్వయంగా సీఎం రంగంలోకి దిగి.. మంత్రులందర్నీ హుజూరాబాద్ వైపు మళ్లించి, నిధుల వరద పారిస్తూ, కొత్త పథకాలను తెరపైకి తెస్తూ ఎన్నో జిమ్మిక్కులు చేస్తున్నారు. దుబ్బాక, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలకంటే.. హుజూరాబాద్ ఎన్నికలను ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం విశేషం. అందుకే కేసీఆర్ తాజా రాజకీయాలన్నిటికీ హుజూరాబాద్ వేదికగా మారుతోంది.