పవన్ కల్యాణ్ రాజకీయాలతోపాటే సినిమాలు కూడా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఫోకస్ అంతా సినిమాలపైనే ఉంది. రాజకీయాలకు పూర్తి టైమ్ కేటాయించలేని పరిస్థితి. అందులోనూ ఆయన ఎంచుకుంటున్న రాజకీయ పంథా మరీ నీరసంగా అనిపిస్తోంది. అధికారంలోకి రావడానికి ఉవ్విళ్లూరే ప్రతిపక్ష నాయకులు ఎలా ఉండాలి? వారి ఆలోచనలు ఎలా ఉండాలి? ఎత్తుగడలు ఎలా ఉండాలి? అనే విషయంలో పవన్ వెనకబడ్డారేమో అనిపిస్తుంది. ప్రజలు, యువత తమకు తామే తమ సమస్యలు పరిష్కరించాలంటూ పవన్ వద్దకు వస్తే అప్పుడు వాటి గురించి ఆలోచిస్తామని హామీ ఇచ్చి పంపించేస్తున్నారు పవన్.