సూట్ కేసు కంపెనీలు పెట్టిన అనుభవంతో సీఎం జగన్, అదే తరహాలో కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారని, ఆర్థికంగా దివాళా తీసే విధంగా పరిపాలిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు నాదెండ్ల మనోహర్. సహజంగా ఇలాంటివన్నీ జనసేన స్టేట్ మెంట్ల రూపంలో సోషల్ మీడియాలో విడుదలవుతుంటాయి. కానీ ఈసారి కాకినాడలో నేరుగా విలేకరులతో మాట్లాడిన నాదెండ్ల మనోహర్, సీఎం జగన్ ని టార్గెట్ చేశారు. జనసేన తరపున చేస్తున్న విమర్శలలాగా కాకుండా, నేరుగా మనోహర్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.