కేసీఆర్ ప్రయోగించిన దళిత బంధు అస్త్రం నుంచి ఎలా బయటపడాలా అన్న వ్యూహాల్లో పార్టీలు ఉన్నాయి. అందుకే కేసీఆర్ పాత హామీలను గుర్తు చేస్తూ దళితుల్లో అపనమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది పక్కా ఎన్నికల అస్త్రమని.. గతంలోనూ కేసీఆర్ ఇలాంటి మాటలు చెప్పి అమలు చేయలేదని గుర్తు చేస్తున్నాయి.