దళిత బంధు పథకం.. మిగిలిన సామాజిక వర్గాల్లో అసూయ కలిగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దళితులకే ఇస్తున్నారు.. మాకు ఎందుకు ఇవ్వడం లేదు.. అన్న ఆగ్రహమూ కలగొచ్చు.. ఇక దళితులతో పాటు బాగా వెనుక బడిన కొన్ని వర్గాలు కూడా మా బతుకులూ అంతే కదా.. మాకు ఆ స్థాయిలో కాకపోయినా అందులో సగమైనా ఇవ్వొచ్చు కదా అనుకుంటాయి. ఈ వ్యతిరేకత పెరిగితే.. అప్పుడు దళిత బంధు బూమరాంగ్ అయ్యే ప్రమాదం లేకపోలేదు.