కర్నాటకలో కాంగ్రెస్ చేతుల్లోనుంచి బీజేపీ అధికారం చేజిక్కించుకుందన్నమాటే కానీ, ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలిచేలా లేదు. యడ్యూరప్పను దించేసి ఆ స్థానంలో బసవరాజ్ బొమ్మైని సీఎం సీట్లో కూర్చోబెట్టిన తర్వాత బీజేపీలో లుకలుకలు మరింత పెరిగాయి. ఇప్పుడు ఏకంగా బీజేపీ అధికారానికి దూరమయ్యే పరిస్థితి వస్తుందని కాంగ్రెస్ నేతలు జోస్యం చెబుతున్నారు.