నారా లోకేష్ అరెస్ట్ అయ్యారు, ఆ వెంటనే పోలీస్ స్టేషన్ నుంచి విడుదలయ్యారు, పిడికిలి బిగించారు, ప్రభుత్వ పతనం మొదలైందని హూంకరించారు. లోకేష్ అరెస్ట్ కి నిరసనగా ఊరూవాడా టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. అంతా బాగానే ఉంది. బీటెక్ విద్యార్థిని రమ్య హత్యోదంతం అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధ్వజమెత్తాయి ప్రతిపక్షాలు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన లోకేష్.. అరెస్ట్ వ్యవహారం మరింత సంచలనంగా మారింది. మొత్తమ్మీద ఒక్కరోజులో టీడీపీ ఏం చేయాలో అంతా చేసింది. వైసీపీ అనవసరంగా వారిని రెచ్చగొట్టి అయోమయంలో పడింది.